News April 5, 2025
BRS రజతోత్సవ సభ.. ఖమ్మం నేతలతో KCR MEETING

బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీఅధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ మదన్ లాల్ నాయక్, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, కమల్ రాజ్ పాల్గొన్నారు.
Similar News
News April 7, 2025
అమలాపురం: కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక

అమలాపురం టౌన్‌లోని కొంకాపల్లికి చెందిన 9 ఏళ్ల బాలిక కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకుంది. 3వ తరగతి చదువుతున్న బాలిక ఆదివారం ప్రైవేటుకు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు బలవంతంగా తీసుకెళ్తుండగా కలశం సెంటర్లో కారు ట్రాఫిక్‌లో చిక్కుకుండగా కిడ్నాపర్ చేతిని కొరికి తప్పించుకున్నట్లు ఫిర్యాదు చేశారని సీఐ వీరబాబు తెలిపారు.
News April 7, 2025
టారిఫ్స్.. బ్యూటిఫుల్ థింగ్: ట్రంప్

టారిఫ్స్ నిర్ణయం US భవిష్యత్తుకు ఎంతో కీలకమన్న విషయం ఏదో ఒకరోజు ప్రజలు తెలుసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఇలా స్పందించారు. ‘చైనా, ఈయూ సహా ఎన్నో దేశాలతో మనకు ఆర్థిక లోటు ఉంది. టారిఫ్స్ విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇదొక బ్యూటిఫుల్ థింగ్. ఈ నిర్ణయంతో $బిలియన్ల ఆదాయం వస్తుంది. జో బైడెన్ మిగిల్చిన లోటును అతిత్వరలో పూడ్చుతాం’ అని పేర్కొన్నారు.
News April 7, 2025
జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.