News April 5, 2025

BRS రజతోత్సవ సభ.. పాలమూరు నేతలతో KCR MEETING

image

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 7, 2025

రామప్పకు 812 ఏళ్లు.. కీ చైన్ చూశారా?

image

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం నిర్మించి 812 ఏళ్లు పూర్తైన సందర్భంగా సేవా టూరిజం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రామప్పను ప్రమోట్ చేయడానికి కీ చైన్ విడుదల చేశారు. కీ చైన్ బిల్లపై ఓవైపు రామప్ప ఆలయం, మరోవైపు నాగిని నృత్యం చేస్తున్న చిత్రాన్ని ముద్రించారు. ఈ కీ చైన్ ఎంతో ఆకర్షణయంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? రామప్పను దర్శించి కీ చైన్ తీసుకోండి.

News April 7, 2025

బిగ్‌బాస్ హోస్ట్‌గా బాలకృష్ణ?

image

తెలుగు బిగ్‌బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హోస్ట్‌గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్. ‘అన్‌స్టాపబుల్’ ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌కూ బాలయ్య ప్లస్ అవుతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 7, 2025

తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నర్సంపేట వాసుల ప్రతిభ

image

నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిభ కనబర్చారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కోచ్‌లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.

error: Content is protected !!