News December 26, 2024

విరాళాల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్సే!

image

2023-24 ఏడాదికి పొందిన అత్యధిక విరాళాల విషయంలో బీఆర్ఎస్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం.. విరాళాల రూపంలో BJP అత్యధికంగా రూ.2244 కోట్లను పొందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 3రెట్లు అధికం. ఇక తర్వాతి స్థానంలో రూ.495.5 కోట్లతో BRS నిలిచింది. కాంగ్రెస్ రూ.288.9 కోట్లు పొందింది. YSRCP 121.5 కోట్లు, DMK రూ.60 కోట్లు పొందినట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడించాయి.

Similar News

News November 13, 2025

32 కార్లతో సీరియల్ అటాక్స్‌కు కుట్ర?

image

ఢిల్లీ బ్లాస్ట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తరలింపునకు, బాంబుల డెలివరీకి 32 కార్లను టెర్రరిస్టులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) సీరియల్ అటాక్స్‌కు కుట్ర చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 6 లొకేషన్లు సహా దేశంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను అధికారులు గుర్తించారని సమాచారం.

News November 13, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 3

image

13. భూమి కంటె భారమైనది? (జ.జనని)
14. ఆకాశం కంటె పొడవైనది? (జ.తండ్రి)
15. గాలి కంటె వేగమైనది? (జ.మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? (జ.ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో.. తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండనివారికి సజ్జనత్వం వస్తుంది.)
17. తృణం కంటె దట్టమైనది ఏది? (జ.చింత)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 13, 2025

భూ కబ్జా ఆరోపణలు.. పవన్‌కు వైసీపీ సవాల్

image

AP: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ కబ్జా పేరిట <<18274471>>Dy.CM పవన్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని YCP మండిపడింది. ‘ఈ భూములన్నీ 2000-2001 మధ్య కొన్నవి కాదా? ఇవి నిజాలు కావని నిరూపించగలరా’ అని పవన్‌కు సవాల్ విసురుతూ డాక్యుమెంట్ల వివరాలను Xలో షేర్ చేసింది. ‘పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా’ అని పేర్కొంది.