News August 9, 2024
సుంకిశాల ఘటనకు బీఆర్ఎస్సే కారణం: మంత్రులు

TG: సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత BRS ప్రభుత్వ అవినీతే కారణమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు. ఘటనా స్థలంలో పర్యటించిన సందర్భంగా మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఘటన చాలా చిన్నది. ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం లేదు. నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారు. BRS నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు పనులు వాళ్ల హయాంలోనే జరిగాయి’ అని అన్నారు.
Similar News
News October 20, 2025
టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

AP ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, TDP ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల్లూరు(D) దగదర్తిలో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్బనాయుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
News October 20, 2025
CDACలో 646 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC)కు చెందిన వివిధ కేంద్రాల్లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.cdac.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News October 20, 2025
VITMలో 12పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM)లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://www.vismuseum.gov.in/