News November 28, 2024
బీఆర్ఎస్వీ నాయకుల్ని తక్షణం విడుదల చేయాలి: కేటీఆర్
గురుకుల సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్వీ నేతల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్లో మండిపడ్డారు. ‘ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా? పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? నిన్న అరెస్ట్ చేసిన మా విద్యార్థి నాయకుల జాడ నేటికీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా ? వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 28, 2024
మేం కక్ష సాధింపులకు పాల్పడట్లేదు: మంత్రి డోలా
AP: గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేశారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. నాడు మూగబోయిన గొంతులు నేడు బయటకు వస్తున్నాయని, తప్పుచేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో స్కామ్ జరిగిందని, నష్ట నివారణ కోసం వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెడుతున్నారని విమర్శించారు.
News November 28, 2024
‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం ఓట్లు రాల్చడం లేదా?
‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం కాంగ్రెస్కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా. LS ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ పుస్తకం’ చేతబూని పదేపదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదిదే ఒరవడి. అయినా JKలో 6, హరియాణాలో 37, మహారాష్ట్ర, ఝార్ఖండ్లో 16 చొప్పునే సీట్లు వచ్చాయి. ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు, సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న. మీరేమంటారు?
News November 28, 2024
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
AP: జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేటు విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని తెలిపింది.