News October 19, 2024
ఇంటర్ అమ్మాయి దారుణ హత్య

AP: ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. కర్నూలు(D) నగరూరుకు చెందిన అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి రాగా అదే గ్రామానికి చెందిన సన్నీ ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించాలని బెదిరించాడు. యువతి నిరాకరించడంతో పురుగుమందు ఆమె నోట్లో పోసి పరారయ్యాడు. పేరెంట్స్ వచ్చి చూడగా అశ్విని చావుబతుకుల్లో కనిపించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది.
Similar News
News January 26, 2026
కలెక్షన్ల సునామీ.. ‘బార్డర్-2’కు రూ.120 కోట్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘బార్డర్-2’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్న రూ.54 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ సెలవు కావడంతో మరో రూ.50 కోట్లు కలెక్ట్ చేసే అవకాశముందని వెల్లడించాయి. అటు ‘ధురంధర్’ మూడు రోజుల్లో రూ.105 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.
News January 26, 2026
కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీలు.. 11 మంది జవాన్లకు గాయాలు

ఛత్తీస్గఢ్-TG సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బాంబుల మోత మోగింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వరుసగా పేలాయి. దీంతో 11 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో 10 మంది DRG, ఒకరు కోబ్రా బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వారిని ఆర్మీ హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. గతేడాది కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31మంది నక్సల్స్ మరణించారు.
News January 26, 2026
దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.


