News October 25, 2024

28 నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ వెబ్ ఆప్షన్లు

image

AP: అగ్రిసెట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ఇటు బీడీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ గడువు ఇవాళ సాయంత్రం వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పొడిగించింది.

Similar News

News October 25, 2024

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటీరియల్ ఇదే!

image

బంగారం, వజ్రాలు వంటి ఖనిజాలు ఖరీదైనవని అనుకుంటాం. కానీ, ప్రపంచంలో ఎవ్వరూ కొనలేని మెటీరియల్ ఒకటి ఉంది. అదే యాంటీమ్యాటర్. భౌతిక శాస్త్రంలో యాంటీమ్యాటర్ అనేది పదార్థానికి వ్యతిరేకమైనదని నిర్వచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే సుమారు $100 ట్రిలియన్లు అయితే దీని 1gm ధర దాదాపు $62.5 ట్రిలియన్లు (రూ.5వేల బిలియన్లు). ఇది భూమి మీద లభించదని, దీనిని రవాణా చేయడమూ ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

News October 25, 2024

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: KTR

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. సిరిసిల్లలో జరిగిన విద్యుత్ మండలి బహిరంగ విచారణలో ఆయన మాట్లాడారు. ‘అన్ని సంస్థలను ఒకే కేటగిరీగా మార్చాలన్న ప్రతిపాదన సరైనది కాదు. ఛార్జీల పెంపుతో చిన్న పరిశ్రమలపై భారం పడుతుంది. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఎక్కడ?’ అని ప్రశ్నించారు.

News October 25, 2024

BREAKING: కొండా సురేఖకు కోర్టు చివాట్లు

image

TG: మంత్రి కొండా సురేఖకు HYD సిటీ సివిల్ కోర్టు చివాట్లు పెట్టింది. KTR వేసిన <<14421276>>పరువునష్టం దావా<<>>ను కోర్టు విచారించింది. బాధ్యత గల పదవిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మందలించింది. ఒక ప్రభుత్వ ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతరకరం, అనూహ్యమని పేర్కొంది. మరోసారి KTRపై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. తన వ్యాఖ్యలకు సంబంధించి పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది.