News October 14, 2025

391 పోస్టులకు BSF నోటిఫికేషన్

image

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ అర్హతతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించినవారు ఈ నెల 16 నుంచి నవంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 23ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి సడలింపు ఉంది. PST,సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/

Similar News

News October 14, 2025

RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం

image

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.

News October 14, 2025

అరిషడ్వర్గాలను తొలగించే ఆరు నియమాలు

image

కృష్ణుడికి ఇష్టమైన కార్తీక దామోదర మాసంలో ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. మన ప్రేమకు ఆయన బందీ అవుతాడని పండితులు చెబుతున్నారు. ప్రార్థన, మహామంత్ర జపం, దామోదర లీలా పఠనం, సాత్విక నివేదన, దీపారాధన, దామోదరాష్టకం పఠనం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని అంటున్నారు. ఈ 6 నియమాలు పాటిస్తే మనలోని అరిషడ్వర్గాలు తొలగి, శ్రీకృష్ణ కటాక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. ఇల్లు గోకులంగా వెలుగొందుతుందని అంటున్నారు.

News October 14, 2025

E20 వాడకంతో ఆ కార్లలో మైలేజ్ డ్రాప్: సర్వే

image

20శాతం <<17378231>>ఇథనాల్<<>> కలిపిన పెట్రోల్‌ను వాడుతున్న కార్లలో మైలేజ్ తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది. మొత్తం 36వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా 2022 అంతకుముందు కొన్న కార్లలో ప్రతి 10లో ఎనిమిదింటిలో ఈ ప్రాబ్లమ్ ఉందని పేర్కొంది. ఆగస్టులో ఈ సమస్య 67శాతంగా ఉండగా ప్రస్తుతం 80శాతానికి పెరిగిందని వివరించింది. అంతేకాకుండా 52% వాహనాదారులు ఇంజిన్, ట్యాంక్ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.