News August 13, 2024
సరిహద్దుల్లో BSF కొత్త వ్యూహం

భారత్ – బంగ్లా సరిహద్దుల్లో అక్రమ వలసలను నివారించడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్థానిక ప్రజల సహకారం తీసుకుంటోంది. బంగ్లా సంక్షోభం తరువాత అక్కడి నుంచి వలసలు ఎక్కువ కావడంతో BSF ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ సమన్వయ సమావేశం పేరుతో స్థానికులతో సమావేశమై వలసల నివారణకు అందించాల్సిన సహకారం గురించి అధికారులు వారికి వివరించి చెబుతున్నారు.
Similar News
News November 27, 2025
NARFBRలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని ICMR-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ( NARFBR)7 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS, PhD, B.V.Sc&AH, MVSc, ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC/ST/Women/PWD/EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://narfbr.org/
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.


