News November 5, 2025
BSNL ఫైబర్.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.399!

సరసమైన రీఛార్జ్ ప్యాక్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను అందిస్తోంది. BSNL తమ ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కేవలం ₹399గా నిర్ణయించింది. దీంతో 60 Mbps వేగంతో నెలకు 3300 GB డేటాను పొందగలరు. ఆ తర్వాత 4Mbps వేగంతో డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మొదటి నెల ఉచితం కాగా.. తొలి 3 నెలలు ప్లాన్‌పై అదనంగా ₹100 తగ్గింపు ఉంటుంది.
Similar News
News November 5, 2025
ఎన్టీఆర్ ఊర మాస్ లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకొచ్చిన ఫొటోలు వైరలవుతున్నాయి. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ తీస్తోన్న మూవీ షూట్‌లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా బరువు తగ్గడంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ బియర్డ్ లుక్‌లో NTR హ్యాండ్సమ్‌గా ఉన్నారని, ‘డ్రాగన్’ మూవీ లుక్ ఇలానే ఉంటుందా? అంటూ పోస్టులు చేస్తున్నారు. తారక్ లుక్ ఎలా ఉంది? COMMENT
News November 5, 2025
సమాజ అవసరాలకు అనుగుణంగా విజన్: CBN

సమష్టి బాధ్యతతో అధికారులు, పారిశ్రామికవేత్తలు భవిష్యత్తరాలకు సరైన మార్గన్ని నిర్దేశించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. ప్రపంచం, సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు తమ విజన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సతీమణికి యూకే డిస్టింగ్విష్ ఫెలోషిప్-2025 అవార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<


