News August 14, 2024
BSNL 4G వచ్చేసింది!

పెరిగిన టారిఫ్ ధరలతో సతమతమవుతున్న టెలికం యూజర్లకు BSNL అదిరిపోయే న్యూస్ చెప్పింది. మొబైల్లో BSNL సిమ్‌కు 4G నెట్వర్క్ వచ్చినట్లు తెలియజేస్తూ ఓ ఫొటోను టెలికమ్యూనికేషన్స్ శాఖ ట్వీట్ చేసింది. అతి త్వరలోనే దగ్గరలోని ఔట్లెట్లలో వినియోగదారులు 4G సిమ్ పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతం టవర్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతున్నందున మొదట కొన్ని చోట్ల 4G నెట్వర్క్ వచ్చే అవకాశం ఉంది.
Similar News
News December 1, 2025
ఎయిర్‌పోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం

ఇటీవల ఢిల్లీలో విమాన సర్వీసుల రద్దుకు GPS స్పూఫింగ్ కారణమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. HYD, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, అమృత్సర్, చెన్నైలకూ ఫేక్ సిగ్నల్స్ వచ్చాయన్నారు. శాటిలైట్ నావిగేషన్‌లో ఇలా జరగడంతో వెంటనే గ్రౌండ్ నావిగేషన్, సర్వైలెన్స్ యాక్టివేట్ చేశామని MP నిరంజన్ రెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సిగ్నల్స్ సోర్స్ గుర్తించే పనిలో కేంద్రం ఉందన్నారు.
News December 1, 2025
కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్‌కు ఆ పార్టీ MP శశిథరూర్‌కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్‌కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్‌లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 1, 2025
సంస్కరణల ప్రభావం.. నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్‌లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.


