News September 24, 2024
BSNL: రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే..

జియో, AirTel లాంటి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు ప్రభుత్వరంగ సంస్థ BSNL గట్టి పోటీ ఇస్తోంది. రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 GB డేటా చొప్పున 160 రోజులకు 320 GB డేటా ఇస్తామని ట్వీట్ చేసింది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
Similar News
News November 27, 2025
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

AP: రేషన్‌షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్‌తోపాటు పప్పులు, నూనెలు, గోధుమ పిండి, రవ్వ తదితర 15 రకాల వస్తువులను తక్కువ ధరకు ఇవ్వనుంది. దీనివల్ల రేషన్ డీలర్లకు అదనపు ఆదాయంతోపాటు పేదలకు లబ్ధిచేకూరుతుందని భావిస్తోంది. ఇప్పటికే రేషన్ డీలర్లతో చర్చించింది. మరోవైపు లబ్ధిదారులకు బియ్యం, షుగర్‌తోపాటు రాగులు, జొన్నలు, కొర్రలు నేటి నుంచి దశలవారీగా ప్రభుత్వం ఇవ్వనుంది.
News November 27, 2025
R.G.L- 7034 వరి రకం ప్రత్యేకతలు

R.G.L- 7034 సన్నగింజ వరి రకం. మొక్క ఎత్తు 100-105 సెం.మీ. దుబ్బుకు 10 నుంచి 14 పిలకలు వస్తాయి. వెయ్యి గింజల బరువు 14.5 గ్రాములు. చిట్టిముత్యాలు, NLR 34449 రకాలను క్రాసింగ్ చేసి R.G.L- 7034ను అభివృద్ధి చేశారు. బలమైన వేరు వ్యవస్థ కలిగి తుఫాన్ సమయంలో పడిపోలేదు. గింజ రాలడం తక్కువ. కాండం దృఢంగా ఉంటుంది. ఉల్లికోడు, దోమపోటు, మానిపండు తెగుళ్లను తట్టుకుంటుంది. హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడి వస్తుంది.