News November 7, 2024

BSNL సంచలనం.. సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు?

image

సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్‌‌లు చేసేలా సరికొత్త టెక్నాలజీని BSNL త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నెట్‌వర్క్ లేకపోయినా, సముద్రాలు, విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సేవలు పొందవచ్చు. డైరెక్ట్ టూ డివైజ్ టెక్నాలజీ కోసం USకు చెందిన వయాశాత్‌తో కలిసి దీనిని పరీక్షిస్తోంది. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్‌వర్క్‌లను లింక్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. శాటిలైట్లే సెల్‌ఫోన్ టవర్లు అవుతాయి.

Similar News

News December 12, 2025

పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

image

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

News December 12, 2025

నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

image

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్‌లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్‌ఫామ్‌లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.

News December 12, 2025

వాట్సాప్‌లో మరో 2 కొత్త ఫీచర్లు

image

మెసేజింగ్ యాప్ వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోని వారికి వాయిస్ మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. వాయిస్ కాల్ చేస్తే వాయిస్ మెసేజ్, వీడియో కాల్ చేస్తే వీడియో మెసేజ్ పంపించే వన్ టచ్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. వాయిస్‌మెయిల్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఫ్లక్స్, మిడ్ జర్నీల సహకారంతో కొత్త తరహా ఇమేజ్‌లను క్రియేట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.