News December 28, 2024

BSNL: 19000 ఉద్యోగులే టార్గెట్‌గా VRS

image

BSNL సంస్కరణలు రెండో దశకు చేరుకున్నాయి. 19000 (35%) ఉద్యోగులే లక్ష్యంగా రెండోసారి VRS అమలుకు టెలికం శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి కోరినట్టు సమాచారం. ఇందుకు రూ.15000 కోట్లు అవసరమవుతాయి. BSNL ఆదాయంలో 38% అంటే రూ.7500 కోట్లు జీతాలకే వెళ్లిపోతోంది. దీనిని రూ.5000 కోట్లకు తగ్గించాలన్నది ప్లాన్. ప్రస్తుతం కంపెనీకి 55వేల ఉద్యోగులున్నారు. తొలి విడత VRSకు మంచి స్పందనే లభించడం గమనార్హం.

Similar News

News November 6, 2025

చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.

News November 6, 2025

దేశంలో అత్యంత పురాతనమైన శివలింగం!

image

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం గురించి తెలుసుకుందాం. తిరుపతి(D) గుడిమల్లం పరశురామేశ్వరాలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ ఆలయం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదని, ఆలయంలోని శివలింగం సుమారు 2,300 ఏళ్లనాటిదని అంచనా వేశారు. ఇక్కడి లింగం సాధారణ రూపంలో కాకుండా, మానవ రూపంలో (వేటగాడి రూపం) రాక్షసుడి భుజాలపై నిలబడినట్లు ఉంటుంది.

News November 6, 2025

ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

image

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <>https://sbi.bank.in/<<>>లో అందుబాటులో ఉంచారు. వీరికి త్వరలో సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు ఆగస్టు 2, 4,5 తేదీల్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ 13న మెయిన్స్ ఎగ్జామ్ పూర్తయిన విషయం తెలిసిందే.