News August 6, 2024
BSWD: లైటు విషయంలో గొడవ.. అన్నను హత్య చేసిన తమ్ముడు
ఇంట్లో లైటు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి ఆవేశంలో తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన బాన్సువాడలోని దాల్‌మల్ గుట్టలో జరిగింది. వకీల్ కృష్ణ(40), వకీల్ రాజు అన్నదమ్ముళ్లు. సోమవారం రాత్రి లైటు విషయంలో గొడవతో రాజు అన్న కృష్ణపై కత్తెరతో దాడికి పాల్పడ్డాడు. మెడపై పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆస్పత్రికి తరలించేలోపు కృష్ణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 19, 2024
NZB: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్
నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిఖత్ బుధవారం డీజీపీ జితేందర్‌ను కలిసి తన జాయినింగ్ ఆర్డర్ అందజేశారు.
News September 19, 2024
NZB: పాము కాటేస్తోంది.. జర భద్రం..!
వర్షాకాలం ఉండడంతో పాముల సంచారం అధికమైంది. పాము కాటుకు గురై.. మృతి చెందుతున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గడ్డి పొదలు, పొలం గట్లను స్థావరం చేసుకుని ఉన్న పాములు రైతులను కాటేస్తున్నాయి. ఎక్కువ శాతంమంది నాటువైద్యంపై ఆధారపడి.. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అపవాదు ఉంది.
News September 19, 2024
బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ పోస్టు
నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పోస్టు ఇచ్చింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1 పోస్టు అయిన డీఎస్పీగా నిఖత్ జరీన్ నియమించింది.