News September 26, 2024
అక్టోబర్ 23 వరకు బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లు

బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లను అక్టోబర్ 23లోపు పూర్తి చేసుకోవాలని కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన 2024-25 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సవరించింది. అక్టోబర్ 23లోపు ఫస్టియర్ తరగతులను ప్రారంభించాలంది. లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల గడువును సైతం అక్టోబర్ 23గానే ఖరారు చేసింది.
Similar News
News November 19, 2025
బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ పేరును BJP ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రేపు ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 202 సీట్లు సాధించింది.
News November 19, 2025
ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం: పాక్ నేత

ఇండియానే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రర్ గ్రూపులతో దాడులు చేస్తామని పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ హెచ్చరించారు. ఇప్పటికే తాము ఈ పని చేశామని, వారు బాడీలను లెక్కించలేకపోతున్నారంటూ విషం కక్కారు. బలూచిస్థాన్‌లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గామ్ అటాక్‌లనే అతను పరోక్షంగా ప్రస్తావించారు.
News November 19, 2025
DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES) 38 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/


