News April 11, 2024
బీటెక్ రవికి ప్రాణహాని ఉంది: కనకమేడల

AP: పులివెందులలో వైఎస్ జగన్‌పై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి ప్రాణహాని ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పులివెందులలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, రవికి ప్రాణహాని లేదంటూ ఎస్పీ తోసిపుచ్చుతున్నారని ఆరోపించారు. వెంటనే తమ అభ్యర్థికి భద్రత కల్పించాలని లేఖలో కోరారు.
Similar News
News March 12, 2026
రష్మిక మందన్న ఆగ్రహం.. కారణమిదే!

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై హీరోయిన్ రష్మిక సీరియస్ <<19364152>>అయిన<<>> విషయం తెలిసిందే. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దయ్యాక ఆమె తల్లి సుమన్ మందన్న ఇచ్చిన పాత ఇంటర్వ్యూను కొందరు వక్రీకరిస్తూ వార్తలు రాయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘గీత గోవిందం’ వివాదం, పెళ్లి తర్వాత నటన మానెయ్యాలనే ఆంక్షలు, రక్షిత్ తల్లికి సారీ చెప్పమనడం వంటి విషయాలను కన్నడ మీడియా తప్పుగా రాయడంతో ఆమె ఇలా రియాక్ట్ అయ్యారని సమాచారం.
News March 12, 2026
ఫిబ్రవరిలో పెరిగిన ద్రవ్యోల్బణం

దేశంలో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2%కు పెరిగింది. కాగా ఇది జనవరిలో 2.74%గా ఉంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది RBI నిర్ణయించిన 2-6% టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉందని కేంద్రం తెలిపింది. ఆహార ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించింది. కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణంపై ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరిలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.75%గా ఉంది.
News March 12, 2026
JEE MAIN: దరఖాస్తులకు మరో ఛాన్స్!

జేఈఈ మెయిన్ సెషన్-2కు దరఖాస్తు చేసుకునేందుకు NTA మరో అవకాశం ఇచ్చింది. విద్యార్థుల నుంచి వినతులు రావడంతో రిజిస్ట్రేషన్ల విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు రాత్రి 9 గంటల వరకు <


