News April 8, 2025
BTPSను సందర్శించిన జెన్కో ఛైర్మన్

మణుగూరు మండలంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను మంగళవారం టీజీ జెన్కో ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం బీటీపీఎస్లో కార్మికుల సంక్షేమంపై ఆరా తీశారు. కార్యక్రమంలో బీటీపీఎస్ సిఈవో బిచ్చన్న, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
KNR: గత 43 నెలల నుంచి రాష్ట్రంలో ‘తొలి స్థానం’

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు. దంత విభాగంలో గత 43 నెలల నుంచి రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవడం అభినందనీయమని. 9 నెలలు నుండి వివిధ నోటి శస్త్ర చికిత్సలు బయాప్సీ 53, ట్రామా 42, ఓడోంటోజెనిక్ కెరటోసిస్ట్ 10, డెంటిజరస్ సీస్ట్ 1, డెంటిజరస్ సిస్ట్ 12, అమెలబ్లాస్టోమా 4, ఓరోఫేషియల్ బర్న్స్ 10, లుడ్విగ్స్ అంజైనా 26 లు చేసినట్లు తెలిపారు.
News November 24, 2025
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు DEO శుభవార్త

గతంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి తిరిగి పరీక్షలు రాసే అవకాశం లేక మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశాన్ని కల్పించినట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించి ఏపీ విద్యాపీఠం www.apopenschool.ap.gov.in వైబ్ సెట్ దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News November 24, 2025
వరంగల్: కమిషనరేట్ పరిధిలో 82 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 82 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 35 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.


