News December 10, 2024
RC16లో సల్మాన్ ఖాన్ వార్తలపై బుచ్చిబాబు క్లారిటీ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ షూటింగ్ కొనసాగుతోంది. ఈక్రమంలో సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని వస్తోన్న వార్తలపై బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలన్నీ ఫేక్ అని, ఆయన ఎలాంటి రోల్ చేయట్లేదని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News November 27, 2025
HYD: చేతిరాత బాగుంటుందా? మరెందుకు ఆలస్యం

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.


