News September 4, 2024

బుడమేరుకు గండి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన

image

AP: విజయవాడలోని బుడమేరు వాగుకు గండి పడింది. దేవీనగర్ వద్ద గండి పడటంతో నీరు గట్టుపై ఉన్న ఇళ్లల్లోకి చేరే అవకాశం ఉంది. రామవరపాడు, ప్రసాదంపాడు, ఏనికేపాడు, నిడమానూరు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Similar News

News November 15, 2025

మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

image

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.

News November 15, 2025

మిరప పంటకు వేరు పురుగుతో తీవ్ర నష్టం

image

వేరు పురుగులు మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. బాగా పెరిగిన వేరు పురుగు ‘సి(C)’ ఆకారంలో ఉండి మొక్క వేర్లపై దాడి చేసి నాశనం చేస్తాయి. పిల్ల పురుగులు మొక్కల వేర్లను కత్తిరించడం వల్ల మొక్క పాలిపోతుంది. కొన్ని రోజుల వ్యవధిలో పూర్తిగా ఎండిపోతుంది. దీని ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి రైతులు ఆర్థికంగా నష్టపోతారు.

News November 15, 2025

మిరపలో వేరుపురుగును ఎలా నివారించాలి?

image

మిరపలో వేరుపురుగుల నియంత్రణకు దీపపు ఎరల ఏర్పాటుతో పాటు లోతు దుక్కులు చేయాలి. జొన్న లేదా సజ్జతో పంట మార్పిడి చేయాలి. ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, ఎకరాకు 100kgల వేపపిండి వేసుకోవాలి. 10 లీటర్ల నీటిలో ఇమిడాక్లోప్రిడ్ 5ml+ కార్బండజిమ్ 10గ్రా. కలిపి ఆ ద్రావణంలో మిరపనారును 15-20 నిమిషాలు ఉంచి తర్వాత నాటుకోవాలి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే 12 కిలోల 3% కార్బోఫ్యూరాన్ గుళికలను భూమిలో వేసుకోవాలి.