News September 3, 2024

బుడమేరుకు ఏడు చోట్ల గండి పడింది: మంత్రి నిమ్మల

image

AP: విజయవాడలో విలయానికి కారణమైన బుడమేరుకు ఏడు చోట్ల గండి పడిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాటిని పూడ్చేందుకు జలవనరుల శాఖ కృషి చేస్తోందని, 2, 3 రోజులు సమయం పడుతుందని చెప్పారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణా కరకట్ట పటిష్ఠతకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీకి 12లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

Similar News

News October 18, 2025

దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

image

TG: దీపావళి పండుగకు 2 రోజుల ముందు వచ్చిన ‘రాష్ట్ర బంద్‌’ పండుగ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వారాంతం కూడా కావడంతో ప్రజలు దీపావళి షాపింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. వస్త్ర, గోల్డ్, స్వీట్స్‌ దుకాణదారులు ఇవాళ భారీ వ్యాపారాన్ని ఆశించారు. కానీ బీసీ సంఘాల బంద్ పిలుపుతో జనం రాక తగ్గి బిజినెస్‌పై ఎఫెక్ట్ పడుతుందని వారు ఆందోళనలో ఉన్నారు. బంద్ ప్రభావం ఎంతో సాయంత్రానికి క్లారిటీ వస్తుంది.

News October 18, 2025

నేడు ఈ వ్రతం చేస్తే బాధల నుంచి విముక్తి

image

శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని నేడు ఆచరిస్తే అపారమైన ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు, ఉద్యోగాభివృద్ధి కోరేవారు ఈ వ్రతం చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరిగి, దారిద్య్రం తొలగి, అన్నింటా విజయం లభిస్తుందంటున్నారు. ధనాదిదేవత లక్ష్మీదేవి, ధనాధ్యక్షుడు కుబేరుని ఆశీస్సులతో శుభం కలుగుతుందంటున్నారు.

News October 18, 2025

NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL)34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు సాధించిన వారు NOV 3వరకు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.50వేల నుంచి రూ.1.60లక్షల వరకు జీతం అందుతుంది. వెబ్‌సైట్: https://www.nhidcl.com/