News July 6, 2025

బౌద్ధమత గురువు దలైలామా 90వ జన్మదినం

image

బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా నేడు 90వ జన్మదినం జరుపుకుంటున్నారు. టిబెట్‌లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన టెన్జింగ్ గ్యాట్సో కేవలం ఐదేళ్ల వయసులోనే 14వ దలైలామా అయ్యారు. చైనా ఆక్రమణ తర్వాత 1959లో ఇండియాకి నిర్వాసితుడిగా వచ్చారు. తన సందేశాలతో 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రపంచమూ ప్రశాంతంగా ఉంటుంది’ అన్న ఆయన మాటలు ఇప్పుడు అన్ని దేశాలకు అవసరం.

Similar News

News July 6, 2025

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్

image

రెండో టెస్టులో భారత్ సంధించిన భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమని, పిచ్ తీరును బట్టి తమ బ్యాటర్లు ఆడతారని ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ అన్నారు. తామేమీ పిచ్చోళ్లం కాదని గెలుపు కుదరకపోతే డ్రా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ‘ఒక్క రోజులో 550కుపైగా పరుగులు చేయడం అసాధ్యం. కానీ మా బ్యాటర్లు మాత్రం పోరాటం ఆపరు’ అని ఆయన స్పష్టం చేశారు.

News July 6, 2025

PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

image

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News July 6, 2025

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

image

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <>నోటిఫికేషన్ <<>>విడుదలైంది. పెళ్లి కాని, టెన్త్ పూర్తైన యువతి, యువకులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అభ్యర్థులు 1-09-2004 నుంచి 29-02-2008 మధ్య జన్మించి ఉండాలి. మ్యూజిక్‌కు సంబంధించిన పలు విభాగాలపై పట్టు ఉండాలి. జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫిట్‌నెస్, మ్యూజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆగస్టు/SEPలోగా నియామకం పూర్తవుతుంది.