News March 20, 2025

BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు, కురుమార్తి ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు కేటాయించగా పాలమూరు ప్రాజెక్టుకు నిరాశే మిగిలింది. బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.

Similar News

News September 16, 2025

పెద్దపల్లిలో సమావేశమైన బీజేపీ నేతలు

image

సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవా పఖ్వాడా కార్యక్రమాలపై పెద్దపల్లి జిల్లా నేతలు నేడు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా స్వదేశీ, ఆత్మనిర్భర్ సందేశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. వీటిలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్ల మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News September 16, 2025

డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

image

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

News September 16, 2025

సిరిసిల్ల: ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివి’

image

సిరిసిల్లలోని కలెక్టరేట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని కొనియాడారు. ఆయన నిర్మించిన సాగునీటి, తాగునీటి కట్టడాలు ఆయనకున్న పట్టుదల నిజాయితీని ప్రపంచం కీర్తించిందని పేర్కొన్నారు.