News March 20, 2025

BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు కేటాయించింది. నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు ఇవ్వగా.. పాలమూరు ప్రాజెక్టుకు రూ.1715కోట్లు దక్కాయి. పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు ఇచ్చింది. బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.

Similar News

News October 22, 2025

విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి..

image

పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్ పై గ్రామానికి వెళ్తున్న తండ్రి, కొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య (60), మాదాల వెంకటేశ్వర్లు (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News October 22, 2025

TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

image

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.

News October 22, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి: సీతక్క

image

జూబ్లీహిల్స్ పరిధి బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.