News March 20, 2025
BUDGET.. లెండి ప్రాజెక్టుకు రూ.42 కోట్లు

కామారెడ్డి జిల్లాకు రాష్ట్ర బడ్జెట్‌లో నామమాత్రంగానే నిధులు కేటాయించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం 22వ ప్యాకేజీకి నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. కోనేళ్లుగా దీనికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. కాగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయినా లెండి ప్రాజెక్టుకు రూ. 42 కోట్లు, కౌలాస్, పోచారం ప్రాజెక్టులకు రూ. 10 కోట్లు, నల్లవాగుకు రూ. 5 కోట్లు కేటాయించారు.
Similar News
News February 28, 2026
వరంగల్: నేడే రాకెట్ ప్రయోగం ఎందుకో తెలుసా..?

వరంగల్ భద్రకాళి బండ్‌పై శనివారం మోడల్ రాకెట్ ప్రయోగం చేపట్టనున్న విషయం తెలిసిందే. సాయంత్రం ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఖగోళ ఘటనల్లో ఒకటైన ప్లానెట్ పరేడ్ శనివారం జరగనుంది. బృహస్పతితో పాటు శుక్రుడు, బుధుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి ప్రధాన గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ అద్భుతం ఆకాశంలో కనిపించనుంది. ఈ విషయాన్ని విద్యార్థులకు కూలంకషంగా వివరించనున్నారు.
News February 28, 2026
అతిసారం అదుపులోనే ఉంది: శ్రీకాకుళం కలెక్టర్

అతిసారం పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 162 కేసులు నమోదు కాగా 47మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 112 మంది చికిత్స పొందుతున్నారు.
News February 28, 2026
మెదక్: ముగ్గురు మహిళ BOSSలు!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.


