News January 20, 2025
బడ్జెట్ 2025: NPSను అట్రాక్టివ్‌గా మారిస్తే..

NPSను మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఇండస్ట్రీ వర్గాలు FM నిర్మలా సీతారామన్‌ను కోరుతున్నాయి. అలా చేస్తేనే స్కీమ్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అంటున్నాయి. 80CCD(1B) డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుంచి లక్షకు పెంచాలని సూచించాయి. 80CCD(2) కింద ఓల్డ్ రెజిమ్‌లో బేసిక్ శాలరీలో 10%, న్యూ రెజిమ్‌లో 14% వరకు జమ చేయొచ్చు. దీనిని 20%కు పెంచితే ప్రైవేటు ఉద్యోగులు స్కీమ్‌ను ఎంచుకుంటారని పేర్కొన్నాయి.
Similar News
News November 25, 2025
హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.