News January 31, 2025

BUDGET 2025: ఆర్థికసర్వేలో ఏముంటుందంటే..

image

బడ్జెట్ ముందురోజు పార్లమెంటులో ఆర్థికసర్వే ప్రవేశపెడతారు. దీనిని CEA రూపొందిస్తారు. గత ఏడాది దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని ఇందులో వివరిస్తారు. ఎకానమీ పరిస్థితి, వృద్ధిరేటు, ఇన్‌ఫ్లేషన్, ట్రేడ్ బ్యాలెన్స్, పరిశ్రమలపై సమీక్ష, ప్రభుత్వ ఆదాయం-ఖర్చులు, ద్రవ్యలోటు, పేదరికం, ఆరోగ్యం, విద్య, ఉపాధి గురించి వివరిస్తారు. వీటిని బట్టి వచ్చే ఏడాదికి పాలసీల రూపకల్పనకు సూచనలు ఉంటాయి. బడ్జెట్‌కు ఇదో ఇండికేషన్‌.

Similar News

News November 17, 2025

నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

image

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్‌లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్‌ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్‌ల నుంచి పై ఫొటోను డిజిటల్‌గా క్రాప్ చేశారు. బ్లూ కలర్‌లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్‌లో ఉన్నవి వలయాల నీడలు.

News November 16, 2025

ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టులో ఆడతారా?

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు మెడ నొప్పి తగ్గినప్పటికీ 4-5 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టులో ఆయన ఆడేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పితో గిల్ బాధపడ్డారు. దీంతో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరారు.

News November 16, 2025

లైటింగ్ పెంచడంతోనే పేలుడు!

image

J&K నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన <<18295101>>పేలుడుకు<<>> అధిక లైటింగే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో ద్రవరూప రసాయనాలు కూడా ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ బృందాలు లైటింగ్ పెంచాయి. దీంతో వెలువడిన వేడి లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చిన పొగలు ఆ రసాయనంతో కలిసి పేలుడు జరిగి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.