News January 16, 2025
BUDGET 2026: రైల్వేస్కు 20% నిధుల పెంపు!
బడ్జెట్లో రైల్వేస్కు 20% ఎక్కువ నిధులు కేటాయిస్తారని సమాచారం. FY25లో కేటాయించిన రూ.2.65లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. ప్రస్తుత CAPEXలో ఇప్పటికే 80-90% మేర ఖర్చుపెట్టేశారు. FY26లో మరిన్ని రైల్వే స్టేషన్లను అప్గ్రేడ్ చేయడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే ట్రాకుల డీకంజెషన్ వంటి పనులు చేపట్టనున్నారు. అందుకే నిధులు పెంచుతారని విశ్లేషకులు అంటున్నారు.
Similar News
News January 16, 2025
కేటీఆర్పై ఈడీ ప్రశ్నల వర్షం
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలుగా ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. అర్వింద్ కుమార్, BLN రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా KTRను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి చెప్పినట్లే తాము చేశామని ఇటీవల ఈడీ విచారణకు హాజరైన అర్వింద్, రెడ్డి చెప్పినట్లు సమాచారం.
News January 16, 2025
ఇంట్లోని ప్లాస్టిక్ వేస్ట్ను ఇలా చేయండి: JD
ఇంటి అవసరాల్లో వినియోగించే ప్లాస్టిక్ కవర్లను సులువుగా ఎలా సేకరించవచ్చో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ‘ప్రతి ఇంట్లో రోజూ నూనె, పాలు, కిరాణా సామగ్రి, షాంపూ, చిప్స్ కవర్లంటూ కనీసం 10 నుంచి 20 ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేస్తాం. వాటిని సీసాలో నింపి మూతపెట్టి డస్ట్బిన్లలో వేసేలా మీ పిల్లలను ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు సులువుగా, జంతువులు తినకుండా ఉంటాయి’ అని తెలిపారు.
News January 16, 2025
మహాకుంభమేళాలో తిరుమల శ్రీనివాసుడికి చక్రస్నానం
ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తిరుమల ఆలయ అర్చకులు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య గంగానదిలో చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు.