News November 12, 2024

ఏడాదిలో 3సార్లు బడ్జెట్

image

ఏపీ ప్రభుత్వం రూ.2.94లక్షల కోట్లతో నిన్న బడ్జెట్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 4నెలల కాలానికి వైసీపీ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ తీసుకొచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే మరోసారి 4నెలలకు, తాజాగా సోమవారం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీంతో ఒకే ఏడాది 3సార్లు బడ్జెట్ ప్రకటించినట్లు అయింది. బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా, ఇవాళ సెలవు ఇచ్చారు. తిరిగి రేపు ప్రారంభం కానున్నాయి.

Similar News

News July 7, 2025

రేపు శ్రీశైలంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

AP: CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గం.లకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12గం.కు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మ.2.30కి అమరావతికి వెళ్తారు.

News July 7, 2025

‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా?’ అని దేవుడికి లేఖ రాసి..

image

TG: వేములవాడకు చెందిన దీటి రోహిత్(23) ఆత్మహత్యకు ముందు దేవుడి(శివుడు)కి రాసిన లేఖ కదిలిస్తోంది. ‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే! మేం కొడుకులం కాదా?’ అని ప్రశ్నించాడు. ‘బెస్ట్ సూసైడ్ లెటర్ రాయాలన్న నా కోరిక ఇప్పుడు నెరవేరింది. మరో జన్మ వద్దు’ అంటూ రాసుకొచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల డాక్టర్ అవ్వాలన్న తన కోరిక తీరకపోవడంతోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.

News July 7, 2025

ఇండియన్ ముస్లింలు బందీలు.. సిటిజన్లు కాదు: ఒవైసీ

image

మైనార్టీలకే ఎక్కువ బెనిఫిట్స్, రక్షణలు ఉన్న ఏకైక దేశం ఇండియానే అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. అవి తమ హక్కులని, చారిటీ కాదని ట్వీట్ చేశారు. ‘మీరు మంత్రి.. చక్రవర్తి కాదు. పాకిస్థానీ, బంగ్లాదేశీ, జీహాదీ, రోహింగ్యా అని పిలిపించుకోవడం బెనిఫిట్ అంటారా? ఇండియన్ మైనారిటీలు కనీసం సెకండ్ క్లాస్ సిటిజన్స్ కూడా కాదు. మేము బందీలం’ అని వ్యాఖ్యానించారు.