News February 1, 2025

BUDGET: స్కూల్ స్టూడెంట్స్ కోసం ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’

image

ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ మిషన్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50వేల పాఠశాలల్లో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ నెలకొల్పుతామని ప్రకటించారు. ఇవి స్టూడెంట్స్‌లో ఆసక్తి, సృజన, సైంటిఫిక్ టెంపర్‌మెంట్ పెంచుతాయని తెలిపారు. డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

Similar News

News November 13, 2025

ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్యకుమార్ యాదవ్

image

AP: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న 10వేల మందికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకొని స్లాట్ బుకింగ్‌, సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారు.

News November 13, 2025

హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

image

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.

News November 13, 2025

ఒక్క జూమ్ కాల్‌తో ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం జూమ్ కాల్‌తో రప్పించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో 5 సంస్థలకు ఆయన భూమిపూజ చేశారు. గూగుల్ AI హబ్‌కు నెలాఖరున శంకుస్థాపన చేస్తామని తెలిపారు. TCS, కాగ్నిజెంట్ సహా అనేక ఐటీ జెయింట్స్ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. 2026 జూన్‌కు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రారంభమవుతుందని వివరించారు.