News July 24, 2024
BUDGET: అందుకే దేశం వదిలి వెళుతున్నారని విమర్శలు

ట్యాక్స్ విషయంలో కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్తో అసంతృప్తికి గురైన ఓ యూజర్ ‘నేను సంపాదించినా, ఖర్చు చేసినా, ఈరెండూ కాకుండా పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్పై మళ్లీ సెస్ వేస్తారు’ అని ట్వీట్ చేశారు. దానిపై కొందరు స్పందిస్తూ ఈ ట్యాక్స్ల వల్లే చాలామంది దేశాన్ని విడిచివెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్కూ మద్దతు వస్తోంది.
Similar News
News October 8, 2025
APPLY NOW: ఇస్రోలో 20 పోస్టులు

ఇస్రో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.isro.gov.in/
News October 8, 2025
మోదీకి కంగ్రాట్స్ చెప్పిన జగన్

ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ చీఫ్ జగన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ‘ఈ మైలురాయి దేశసేవ పట్ల మీ అంకితభావం, పట్టుదల, నిబద్ధతను తెలియజేస్తోంది. మీరు ఇలాగే పని చేస్తూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News October 8, 2025
రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధిస్తాం: ఉత్తమ్

తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దీని నుంచి 1.48 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు. 90.46 లక్షల టన్నుల సన్నాలు, 57.84 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యం పంట చేతికొస్తుందని చెప్పారు. క్వింటాల్ సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని.. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం కొంటుందన్నారు.