News July 23, 2024
బడ్జెట్ రోజు: 90% విన్నింగ్ రేటున్న స్టాక్ ఇదే

బడ్జెట్ రోజు షేర్లు ఆటుపోట్లకు లోనవుతాయి. సెన్సెక్స్‌లో ఒక స్టాక్ మాత్రం 90% విన్నింగ్ స్ట్రైక్‌రేట్ కొనసాగిస్తోంది. చివరి 10 బడ్జెట్లలో ఐటీసీ 9సార్లు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సగటున 1.47% పెరిగింది. 2016 నుంచి చూస్తే 2020లో మాత్రమే 7% పతనమైంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు సుంకం రూపంలో ఎక్సైజ్ డ్యూటీ పెంచడమే ఇందుకు కారణం. ఇండస్ ఇండ్, కొటక్ బ్యాంకులు 80% స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాయి.
Similar News
News April 6, 2026
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది!

ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL రూ.1 ప్లాన్ ఆఫర్‌ను మళ్లీ తెచ్చింది. రూపాయికే 30 రోజుల పాటు వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటాను అందిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు కొత్త వినియోగదారులకే ఈ ఆఫర్ వర్తించనుంది. తమ సర్వీస్ సెంటర్/రిటైలర్ వద్ద ఉచితంగా సిమ్ పొందొచ్చని BSNL ట్వీట్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘BSNL ఆజాదీ కా ప్లాన్’ పేరిట గతంలో ఈ ఆఫర్‌ను సంస్థ తీసుకొచ్చింది.
News April 6, 2026
పెళ్లికి సిద్ధమైన అనుపమా పరమేశ్వరన్?

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. వచ్చే నెలలో ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని తెలుస్తోంది. వరుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే అని వార్తలు వస్తున్నాయి. అయితే అది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది క్లారిటీ లేదు.
News April 6, 2026
నిత్యావసర సరకుల ధరల్లో మార్పులు లేవు: కేంద్రం

దేశంలోని నిత్యావసర సరకుల ధరలు, LPG లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఉల్లి, టమాటా, ఆలుగడ్డ ధరలు స్థిరంగా ఉన్నాయని.. గోధుమ, బియ్యం ధరల్లోనూ మార్పులేదని తెలిపింది. బఫర్ స్టాక్స్ తగినంతగా ఉన్నాయని పేర్కొంది. ముడి చమురు, LPG సరఫరా సమృద్ధిగా ఉందని, కొరత ఉందనే వదంతులను నమ్మవద్దని సూచించింది. బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.


