News July 23, 2024

తెలంగాణకు బడ్జెట్‌లో మళ్లీ గుండు సున్నాయే: కేటీఆర్

image

TG: బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు ప్రతిసారీ అన్యాయమే చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఆర్ఎస్ మండిపడ్డారు. ‘గడచిన పదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేం లేదు. ఈసారి కూడా న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు మళ్లీ గుండు సున్నాయే’ అని పేర్కొన్నారు.

Similar News

News April 1, 2026

అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి

image

ఇరాన్ అన్నంత పని చేసింది. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్‌పై క్షిపణులతో దాడి చేసింది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని సమాచారం. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 18 టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ <<19529158>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఇవన్నీ తమపై దాడులకు సహకరిస్తున్నాయని టెహ్రాన్ మండిపడుతోంది.

News April 1, 2026

ఢిల్లీ బౌలర్లు భళా.. లక్నో స్కోర్ ఎంతంటే?

image

IPL: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. మార్ష్ 35, పంత్ 7, మార్క్రమ్ 11, పూరన్ 8, అబ్దుల్ సమద్ 36, ముకుల్ 14, షహబాజ్ అహ్మద్ 15* రన్స్ చేశారు. నటరాజన్, ఎంగిడి చెరో 3 వికెట్లతో లక్నో బ్యాటర్లను బోల్తా కొట్టించారు.

News April 1, 2026

పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

image

విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి టికెట్ బుకింగ్స్‌పై ఇంధన ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ₹275-₹950, ఇంటర్నేషనల్ సర్వీసులలో ₹900-₹10,000 వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు 25%, ఇంటర్నేషనల్ సర్వీసెస్‌పై 100% ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.