News February 28, 2025
BUDGET: ‘తల్లికి వందనం’కు రూ.10,300 కోట్లు!

AP: 2025 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నిధులు కేటాయించనుంది. ‘తల్లికి వందనం’కు రూ.10,300 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.10,717 కోట్లు అవసరమని అంచనా వేశారు. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం, మహిళలకు వడ్డీలేని రుణాలకు నిధులు కేటాయించనుంది.
Similar News
News December 5, 2025
అఖండ-2 వాయిదా.. బాలయ్య తీవ్ర ఆగ్రహం?

అఖండ-2 సినిమా రిలీజ్ను <<18473406>>వాయిదా<<>> వేయడంపై బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఫైనాన్స్ ఇబ్బందులను దాచడంపై నిర్మాతలతోపాటు డైరెక్టర్ బోయపాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభిమానులతో ఆటలు వద్దని, సాయంత్రంలోపు విడుదల కావాల్సిందేనని పట్టుబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్పటికప్పుడు బడా ప్రొడ్యూసర్లు 14 రీల్స్ నిర్మాతలకు కొంత సాయం చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 5, 2025
మోదీ-పుతిన్ మధ్య స్పెషల్ మొక్క.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్ హౌస్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొనగా.. వీరి మధ్య ఉంచిన ఓ మొక్క అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మొక్క పేరు హెలికోనియా. ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు దీనిని ఉంచడం శుభ సూచకంగా భావిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి & అభివృద్ధికి సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News December 5, 2025
14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. DEC 4తో గడువు ముగియగా.. DEC 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.


