News July 23, 2024

BUDGET.. వారికి జీరో ట్యాక్స్

image

కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి గతంలో రూ.7లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది కాదు. సెక్షన్ 87A కింద రూ.25వేలు రిబేట్ లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50వేలు కలిపి ₹7.50 లక్షల వరకు పన్ను కట్టే పనిలేదు. తాజా బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ ₹75వేలకు పెంచారు. రిబేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో రూ.7.75 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Similar News

News April 1, 2026

అమరావతికి చట్టబద్ధత.. నేడే పార్లమెంట్‌లో బిల్లు

image

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.

News April 1, 2026

ఎలాంటిచోట గొప్పతనం చూపకూడదు?

image

అనువుగానిచోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ యద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఒక పెద్ద కొండ ముందు అద్దం పెట్టి చూస్తే ఆ కొండ చిన్నగా కనిపిస్తుంది. నిజానికి ఆ కొండ స్థాయి తగ్గలేదు. అలాగే మనకు తగని ప్రదేశం లేదా సమయంలో గొప్పతనం చూపకూడదు. అలా తగ్గి ఉన్నప్పటికీ మన స్థాయి తగ్గిపోదు.
<<-se>>#PADHYAM<<>>

News April 1, 2026

నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం

image

ఈరోజు నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తుంది. దీంతో HYDలో ఉద్యోగులకు ప్రస్తుతం మూలవేతనంలో 40%గా ఉన్న HRA 50%కు పెరగనుంది. ఇకపై HRA క్లెయిమ్ చేసేటప్పుడు యజమాని వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. వార్షిక వడ్డీ ఆదాయం ₹50వేలు మించితే TDS వర్తించనుంది. పిల్లల హాస్టల్ బిల్లు మినహాయింపు ₹300 నుంచి ₹9వేలకు పెరగనుంది. ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి ₹5వేల నుంచి ₹15వేలకు పెరగనుంది.