News March 20, 2025

BUDGET.. లెండి ప్రాజెక్టుకు రూ.42 కోట్లు

image

కామారెడ్డి జిల్లాకు రాష్ట్ర బడ్జెట్‌లో నామమాత్రంగానే నిధులు కేటాయించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం 22వ ప్యాకేజీకి నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. కోనేళ్లుగా దీనికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. కాగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయినా లెండి ప్రాజెక్టుకు రూ. 42 కోట్లు, కౌలాస్, పోచారం ప్రాజెక్టులకు రూ. 10 కోట్లు, నల్లవాగుకు రూ. 5 కోట్లు కేటాయించారు.

Similar News

News March 21, 2025

MBNR: చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News March 21, 2025

బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. ఆస్పత్రి సీజ్

image

బనగానపల్లెలో ఆయుష్ వైద్య అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బనగానపల్లెలో అనధికారికంగా, వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు సూర్య నాయుడును గుర్తించారు. పక్షవాతానికి వైద్యం చేస్తానంటూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు అందడంతో ఆయుష్ శాఖ అధికారులు డా.రవికుమార్, వాణి తనిఖీకి వెళ్లగా నకిలీ వైద్యుడు పరారయ్యాడు. ఆయుష్ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.

News March 21, 2025

భీమవరం: ఉద్యోగికి 15 రోజుల రిమాండ్

image

నిధుల దుర్వినియోగం కేసులో ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. వివరాల్లోకి వెళితే… భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను అరెస్ట్ చేసి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.

error: Content is protected !!