News July 10, 2024

బుగ్గన పార్టీ మారడం లేదు: వైసీపీ

image

AP: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. ‘బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారడం లేదు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది. ఆయన బీజేపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై మండిపడుతూ ట్వీట్ చేసింది.

Similar News

News January 9, 2026

సాదాబైనామాకు ‘అఫిడవిట్’ నిబంధన తొలగింపు?

image

TG: సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి విక్రయదారుడి అఫిడవిట్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని CCLA నిర్ణయించినట్లు సమాచారం. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే ఛాన్సుంది. ఎప్పుడో కొన్న భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే విక్రయదారులు అంగీకరించకపోవచ్చని, దీని వల్ల సమస్యలొస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో రెవెన్యూశాఖ న్యాయ సలహా కోరగా అఫిడవిట్ నిబంధనను మినహాయించుకోవచ్చని AG స్పష్టం చేశారు.

News January 9, 2026

నెహ్రూ అంటే గౌరవమే.. కానీ: థరూర్

image

నెహ్రూ అంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ ఆయన చేసిన ప్రతి పనిని తాను గుడ్డిగా సమర్థించనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. నెహ్రూ మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలంగా నాటారని ప్రశంసించారు. అయితే 1962 చైనా యుద్ధం లాంటి విషయాల్లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయన్నారు. BJP ప్రతి చిన్న విషయానికి నెహ్రూను నిందించడం సరికాదని.. ఆయనను ఒక బూచిగా వాడుకుంటున్నారని విమర్శించారు.

News January 9, 2026

FY26లో జీడీపీ వృద్ధి 7.5 శాతం: SBI

image

దేశ GDP వృద్ధి రేటు 2025-26లో 7.5% ఉండొచ్చని SBI రిపోర్టు వెల్లడించింది. ‘NOV చివరికి ₹9.8L Cr ద్రవ్యలోటు ఉంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 62.3%. FY26 బడ్జెట్ అంచనాల కంటే పన్నుల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం ఎక్కువగా ఉంది. అందువల్ల మొత్తం ఆదాయంపై ప్రభావం పడకపోవచ్చు. ద్రవ్యలోటు ₹15.85L Crగా(బడ్జెట్ అంచనా ₹15.69L Cr) ఉండొచ్చు. దీన్నిబట్టి ఫిస్కల్ డెఫిసిట్ 4.4%గా ఉండొచ్చు’ అని పేర్కొంది.