News July 12, 2024
టైమ్ స్క్వేర్లాంటి బిల్డింగ్ హైదరాబాద్‌లోనూ!

TG: న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లాంటి ఐకానిక్ ప్లేస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. HYDలోని రాయదుర్గంలో నెలకొల్పే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. టీస్క్వేర్ నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది. ఇప్పటివరకూ పలువురి సెలబ్రిటీల బర్త్ డేలు, మూవీ అప్డేట్స్ను టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించేవాళ్లు.
Similar News
News October 19, 2025
దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.
News October 19, 2025
దీపావళికి తాబేలును ఎందుకు కొంటారు?

దీపావళి సందర్భంగా తాబేలును ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. తాబేలు అనేది విష్ణుమూర్తి కూర్మావతారానికి ప్రతీక. అందుకే అనేక ఆలయ కోనేట్లలో తాబేళ్లను వదులుతారు. దీపావళి రోజున దీన్ని ఇంటికి తేవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘాయుష్షుకు సంకేతమైన ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫలితంగా కుటుంబం సుఖ సంతోషాలతో వెలుగొందుతుందని భావిస్తారు.
News October 19, 2025
శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు

అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచులోనే ఓటమి చవిచూసిన కెప్టెన్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ చేరారు. భారత్ నుంచి ఈ లిస్టులో అతనితో పాటు కోహ్లీ ఉన్నారు. గిల్ గత ఏడాది జింబాబ్వే చేతిలో టీ20 మ్యాచ్ ఓడగా, ఈ ఏడాది టెస్ట్ (vsENG), ODI(vsAUS)లో పరాజయం పాలయ్యారు. కాగా ఈ ఏడాది వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే తొలి ఓటమి. వరుసగా 8 విజయాలు సాధించిన తర్వాత ఇవాళ AUSతో మ్యాచులో ఓడింది.