News November 4, 2024
రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్

AP: అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPSల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA సిద్ధమైంది. రూ.524 కోట్ల వ్యయ అంచనాతో త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ పనులను 9 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో రూ.700 కోట్ల అంచనాతో ప్రారంభించి రూ.444 కోట్లు వెచ్చించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు ఆగిపోయాయి.
Similar News
News November 24, 2025
చర్లపల్లి టెర్మినల్కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.
News November 24, 2025
పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.
News November 24, 2025
అమెరికా వీసా రాలేదని..

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.


