News August 27, 2024
కూల్చివేతలకు అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించాలి: రఘునందన్

TG: హైడ్రా కూల్చివేతలకు మద్దతు తెలుపుతూ BJP MP రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పెద్దలను వదిలి పేదల కట్టడాలను కూలిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. రికార్డుల ప్రకారం ఎంతటివారినైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించాలని రఘునందన్ వ్యాఖ్యానించారు.
Similar News
News December 9, 2025
పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్‌ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.
News December 9, 2025
వాజ్‌పేయి పాలసీలతో అభివృద్ధికి పునాది: CM

AP: ఈనెల 11-25 మధ్య జరిగే ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్ర’లో కూటమి నేతలంతా పాల్గొనాలని CM CBN సూచించారు. వాజ్‌పేయి సుపరిపాలనకు నాంది పలికారని, ఆయన పాలసీలతోనే దేశాభివృద్ధికి పునాది పడిందని చెప్పారు. రోడ్లు, విమానయాన, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించేవారన్నారు. PM మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
News December 9, 2025
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)వరంగల్‌లో 3పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, B.Sc( Food Tech), MSc( Food Tech), BA/BSc(సైకాలజీ)లేదా MA/MSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PWBDలకు రూ.300. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitw.ac.in/


