News October 3, 2024
ఆర్మీకి బులెట్ప్రూఫ్ జాకెట్స్.. DRDO, ఐఐటీ-డి తయారీ

రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ(DRDO), ఢిల్లీ ఐఐటీ కలిసి భారత సైన్యం కోసం బులెట్ ప్రూఫ్ జాకెట్లను తయారుచేశాయి. వీటికి ‘అభేద్’గా పిలుస్తున్నాయి. ఏకే-47, స్నైపర్ తూటాలను కూడా తట్టుకోగల సామర్థ్యం వీటి సొంతమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న జాకెట్లకంటే ఇవి చాలా తేలికగా ఉంటాయని, 8 తూటాలను ఆపగలవని వివరించారు. వీటి ఉత్పత్తిని 3 సంస్థలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 15, 2025
తిరిగి వస్తాం.. మీ ప్రేమకు ధన్యవాదాలు: మెస్సీ

అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ మూడు రోజుల్లో కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించగా.. భారతీయ అభిమానుల నుంచి వచ్చిన ప్రేమకు ముగ్ధులయ్యారు. ‘మేము మీ ప్రేమనంతా మాతో తీసుకెళ్తున్నాం. కచ్చితంగా తిరిగివస్తాం. మ్యాచ్ ఆడటానికి లేదా మరే సందర్భంలోనైనా ఇండియాను సందర్శిస్తాం’ అంటూ అభిమానులకు మెస్సీ ధన్యావాదాలు తెలిపారు.
News December 15, 2025
రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కవిత విమర్శలు చేశారు. ‘#AskKavitha’లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘వాగ్దానాలు నెరవేరలేదు. కమిట్మెంట్స్ అన్నీ విఫలమయ్యాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు’ అని ధ్వజమెత్తారు. హీరో రామ్ చరణ్ గురించి మరొకరు అడగ్గా ‘ఆయన ఎంతో వినయంగా ఉంటారు. గొప్ప డాన్సర్. కానీ నేను చిరంజీవి అభిమానిని కాబట్టి ఆయనే గొప్ప’ అని బదులిచ్చారు.
News December 15, 2025
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

ఈ సమయంలో మిరపలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఉంటుంది.
☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.


