News January 2, 2025
బుల్స్ జోరు.. కొత్త ఏడాది హుషారు

కొత్త ఏడాది ఇన్వెస్టర్లలో జోష్ నింపినట్టు కనిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలు గడించాయి. Sensex 1,436 పాయింట్ల లాభంతో 79,943 వద్ద, Nifty 445 పాయింట్లు ఎగసి 24,188 వద్ద స్థిరపడ్డాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో రంగ షేర్లు అత్యధికంగా 3.79% లాభపడ్డాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియల్టీ రంగ షేర్లు రాణించాయి.
Similar News
News December 3, 2025
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.
News December 3, 2025
19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్తోపాటు అన్ని ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ల స్వీకరణను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. అఫ్గానిస్థాన్, సోమాలియా సహా 19 నాన్ యూరోపియన్ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేషనల్ సేఫ్టీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. US నేషనల్ గార్డుపై అఫ్గానిస్థాన్ పౌరుడు దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
News December 3, 2025
వన్యప్రాణులతో పొలాలకు పెరుగుతున్న ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు వన్యప్రాణుల ముప్పు పెరుగుతోంది. AP, తెలంగాణలో 90% పంట పొలాలకు కోతుల సమస్య, 50% పొలాలకు అడవి పందుల సమస్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. TG లోని గద్వాల్, MBNR, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కృష్ణ జింకలతో.. APలోని అనేక జిల్లాల్లో కోతులు, అడవి పందులు, కృష్ణజింకలు, దుప్పులతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అదనంగా ఏనుగులతో పంట పొలాలకు నష్టం వాటిల్లుతోంది.


