News May 1, 2024
నన్ను బెదిరించడం జరగని పని: రేవంత్
TG: ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అంశాలు పక్కకెళ్లాయని CM రేవంత్ తెలిపారు. ‘ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా? అనే అంశాలపైనే జరుగుతున్నాయి. నేను మోదీ, అమిత్ షాల కంటే చిన్నవాడినే కావొచ్చు. కానీ పోలీసులతో నన్ను బెదిరించాలని చూస్తే.. అది మాత్రం జరగదు. కావాలంటే ఒకాయన ఈ రాష్ట్రంలోనే ఫ్రీగానే ఉన్నాడు. ఆయనను వెళ్లి అడగండి. నన్నే భయపెట్టే ప్రయత్నాన్ని విరమించుకోండి’ అని సూచించారు.
Similar News
News January 1, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్
నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.
News January 1, 2025
విశ్వ వేదికపై విజయ గీతికగా TG ప్రస్థానం ఉండాలి: CM
TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రజినీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా X వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.
News January 1, 2025
నిన్న భారీగా కండోమ్ అమ్మకాలు!
ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’లో నిన్న భారీగా కండోమ్ ప్యాకెట్లు ఆర్డర్ వచ్చినట్లు సంస్థ పేర్కొంది. నిన్న సాయంత్రం 5.30 వరకే 4779 కండోమ్స్ బుక్ అయినట్లు తెలిపింది. వీటితోపాటు రాత్రి 7.30 వరకు 2.21 లక్షల చిప్స్ ప్యాకెట్లు అమ్ముడయ్యాయంది. అయితే, నిన్న రాత్రి వచ్చిన ఆర్డర్లలో ప్రతి 8లో ఒకటి ఇతరుల కోసం ఆర్డర్ చేసినవేనని, ఇది మదర్స్ డే, వాలెంటైన్స్ డేను అధిగమించిందని తెలిపింది.