News December 31, 2024
మందు బాబులకు బంపరాఫర్.. రాత్రి 10 గంటల నుంచి ఫ్రీ

కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్‌లో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని TG ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 9177624678 నంబర్‌కి కాల్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామంది. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా ఈ సేవలు అందిస్తామని పేర్కొంది.
Similar News
News November 26, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు పూర్తి బందోబస్తు: ఎస్పీ

జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్ జిల్లా, రాష్ట్ర చెక్ పోస్టులను కట్టుదిట్టంగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రభావితం చేసే అక్రమ రవాణా జరగడానికి వీలు లేదని పేర్కొన్నారు.
News November 26, 2025
iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.
News November 26, 2025
Official: అహ్మదాబాద్‌లో కామన్ వెల్త్ గేమ్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్‌లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.


