News October 15, 2024
BUMPER OFFER: వైన్ షాప్ వదిలేస్తే రూ.కోటి!

AP: వ్యక్తిగతంగా వైన్ షాపులు దక్కించుకున్నవారికి సిండికేట్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దుకాణ నిర్వహణ కోసం దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అంత స్థోమత లేనివారిపై సిండికేట్లు ఒత్తిడి చేస్తున్నారు. షాపు వదిలేస్తే రూ.కోటి నుంచి రూ.1.2 కోట్ల వరకు ముట్టచెబుతామని చెబుతున్నారు. అలాగే గుడ్ విల్ కింద నెల నెలా రూ.15 వేలు కూడా ఇస్తామని ప్రకటించడంతో డ్రాలో అదృష్టం వరించిన వారు ఆలోచనలో పడ్డారు.
Similar News
News October 19, 2025
ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్సైట్: https://www.iitb.ac.in/career/apply
News October 19, 2025
కోడి పిల్లలను వదిలాక షెడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్లో రాత్రంతా లైట్లను ఆన్లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.
News October 19, 2025
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు చెప్పారు. కాగా శ్రీవారిని నిన్న 82,136 మంది దర్శించుకున్నారు. వారిలో 29,023 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా స్వామివారికి రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చింది.