News June 19, 2024
అభిషేక్, నితీశ్‌కు బంపరాఫర్?

SRH ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డికి BCCI బంపరాఫర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జులైలో జరిగే జింబాబ్వే పర్యటనకు వీరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వీరితోపాటు హర్షిత్ రాణా, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, విజయ్ కుమార్, యశ్ దయాల్‌ను సెలెక్ట్ చేయనున్నట్లు టాక్. అలాగే రింకూ సింగ్, గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకూ స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అనౌన్స్మెంట్ రానుంది.
Similar News
News March 28, 2026
యుద్ధం ఇంకొన్ని వారాలే: అమెరికా

పశ్చిమాసియా యుద్ధం కొన్నివారాల్లోనే ముగియనుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మిలిటరీ యాక్షన్స్ అనుకున్న సమయం కంటే వేగంగానే టార్గెట్‌ను రీచ్ అవుతున్నాయని, ఈ యుద్ధం నెలల తరబడి కొనసాగదని స్పష్టం చేశారు. ఈ పోరాటంలోకి అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్‌ను రంగంలోకి దించాల్సిన అవసరం లేదని, వ్యూహాత్మక చర్యలతోనే శత్రువును దెబ్బకొడతామని వెల్లడించారు.
News March 28, 2026
కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు ముప్పు

చాలామంది బ్లడ్ టెస్టుల్లో కేవలం HDL, LDL మాత్రమే చూసుకుంటారు. అయితే కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు రావడానికి లిపోప్రోటీన్(a) లేదా Lp(a) ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది జన్యుపరంగా వస్తుంది కాబట్టి ఆహారం, వ్యాయామంతో సంబంధం లేకుండా పుట్టుకతోనే శరీరంలో స్థిరంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డకట్టే రిస్క్‌ను పెంచుతుంది. భారతీయులలో ఈ ముప్పు మరీ ఎక్కువ.
News March 28, 2026
గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ అరెస్ట్

గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదం తర్వాత ‘డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్’ (DUI) కింద అరెస్ట్ అయ్యారు. ఆయన నడుపుతున్న కారు ఒక ట్రక్కును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వుడ్స్ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఆయన డ్రింక్ చేయలేదని బ్రీత్ అనలైజర్ టెస్టులో తేలినప్పటికీ మూత్ర పరీక్ష చేయడానికి నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైనా డ్రగ్స్ వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


