News March 30, 2024
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బుమ్రా?

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడిపై ముంబై ఫ్రాంచైజీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు ఓటములకు అతడే కారణమని భావిస్తున్నట్లు టాక్. దీంతో ఆ జట్టు పగ్గాలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేనేజ్మెంట్ తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో ముంబై ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది.
Similar News
News October 27, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోని <<18115652>>మరోసారి<<>> తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 27, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ, డిగ్రీ, ఎండీ(రేడియాలజీ), ఎంబీబీఎస్, డీఎన్బీ, బీఎస్సీ(నర్సింగ్), డిప్లొమా(నర్సింగ్), ఇంటర్, DMLT, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.nia.nic.in/
News October 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 48 సమాధానాలు

1. హనుమంతుడి గురువు ‘సూర్యభగవానుడు’.
2. వ్యాసుని తల్లి ‘సత్యవతి’.
3. కుబేరుడి వాహనం ‘నరుడు’.
4. కామదహనం జరిగే పండుగ ‘హోళి’.
5. ఇంద్రుని వజ్రాయుధం చేసింది ‘దధీచి మహర్షి’.
<<-se>>Ithihasaluquiz<<>>


