News November 21, 2024
BGTలో బుమ్రా కెప్టెన్.. 2021లోనే చెప్పిన నెటిజన్!

బిడ్డ పుట్టిన కారణంగా రోహిత్ BGT సిరీస్ కోసం ఇంకా ఆస్ట్రేలియా వెళ్లలేదు. దీంతో తొలి మ్యాచ్‌కి బుమ్రా కెప్టెన్ అయ్యారు. ఇదంతా ఈ మధ్య జరిగింది. కానీ ఓ నెటిజన్ 2021 డిసెంబరు 31న దీన్ని అంచనా వేశారు. ‘BGT మ్యాచ్‌కి టాస్ కోసం బుమ్రా, కమిన్స్ కెప్టెన్లుగా వస్తున్నట్లుగా ఊహించుకున్నా’ అని అప్పట్లో ట్వీట్ చేశారు. దాన్ని రీట్వీట్ చేసి ‘తర్వాత ఏం కోరుకోమంటారు?’ అంటూ అడిగిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Similar News
News December 11, 2025
‘అలాంటి వరి రకాల సాగును ప్రోత్సహించాలి’

ప్రజలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే వరి రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా ఎగుమతికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సుబాబుల్ రైతులకు మంచి ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ, ఇతర ఉద్యానపంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.
News December 11, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 11, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరో నోటిఫికేషన్ విడుదల

<


