News January 1, 2025
రికార్డు సృష్టించిన బుమ్రా

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. ICC టెస్టు ర్యాంకింగ్స్లో అత్యధికంగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత బౌలర్గా నిలిచారు. గత వారం <<14977764>>అశ్విన్(904p) రికార్డును<<>> సమం చేసిన ఆయన మెల్బోర్న్ టెస్టు ప్రదర్శనతో దానిని అధిగమించారు. ప్రస్తుతం బుమ్రా టెస్టుల్లో తొలి ర్యాంకులో ఉండగా హేజిల్వుడ్, కమిన్స్, రబాడ, జాన్సెన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Similar News
News October 24, 2025
నింగిలోకి ఎగిరిన తొలి స్వదేశీ ట్రైనర్ ఫ్లైట్

స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసిన భారత తొలి ట్రైనర్ ఫ్లైట్ నింగిలోకి ఎగిరింది. బెంగళూరులో తయారు చేసిన హిందుస్థాన్ టర్బో ట్రైనర్-40(HTT-40) అందుబాటులోకి వచ్చినట్లు HAL వెల్లడించింది. దీని ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ వారియర్స్ శిక్షణ పొందుతారంది. ముందు ఒకరు, వెనుక మరొకరు కూర్చునేలా డిజైన్ చేసింది. బేసిక్ ఫ్లైట్ ట్రైనింగ్, వైమానిక విన్యాసాలు, నైట్ ఫ్లైయింగ్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.
News October 24, 2025
అడవులను కబ్జా చేస్తే ఎవరినీ ఉపేక్షించం: పవన్

AP: అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని Dy.CM పవన్ హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్లో మాట్లాడారు. ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తాం. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తాం. రాష్ట్రంలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణానికి కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.
News October 24, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని APSDMA తెలిపింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడే అవకాశం ఉందంది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్రలో శనివారం భారీ, ఆదివారం అతిభారీ, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.


