News December 29, 2024

అంతటా బుమ్రానే..

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్‌ను ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు ఆకట్టుకుంటోంది. ‘కంగారూలు దూకగలవు కానీ బుమ్రా నుంచి దూరంగా పారిపోలేవు’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ అంతటా బుమ్రానే ఉన్నారని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా 29 వికెట్లు తీశారు.

Similar News

News December 31, 2024

పంత్‌ ఆటను తప్పుబట్టలేం: రోహిత్ శర్మ

image

మెల్‌బోర్న్‌లో టీమ్ ఇండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ‘ఎంసీజీలో ఆఖరి ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. ఓటమి కచ్చితంగా నిరాశకు గురిచేసింది. పంత్ ఔట్ అయ్యాక ఓటమి తప్పదని అర్థమైంది. అతడి ఆటను తప్పుబట్టలేం. ఎన్నోసార్లు ఈ ఆటతోనే భారత్‌ను గెలిపించారు. ఏదేమైనా.. ఈ ఓటమిని పక్కన పెట్టి సిడ్నీలో గెలవడంపై దృష్టి సారిస్తాం’ అని స్పష్టం చేశారు.

News December 31, 2024

బొర్రా గుహల్లో మహేశ్ బాబు సినిమా షూటింగ్?

image

మహేశ్ బాబుతో తాను తెరకెక్కించే సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను APలోని బొర్రా గుహల్లో తీయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జక్కన్న తన టీమ్‌తో గుహల్ని సందర్శించారు. అధికశాతం టాకీ పార్ట్‌ను ఆఫ్రికా అడవుల్లోనే షూట్ చేయొచ్చని సమాచారం. SSMB29గా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది వేసవి నుంచి ప్రారంభం కానుంది. ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

News December 31, 2024

గాజాపై దాడి పర్యవసానాలను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సిందే: నిపుణులు

image

గాజాపై చేసిన యుద్ధం తాలూకు పర్యవసానాలను ఇజ్రాయెల్ కచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనని UN నిపుణులు తాజాగా తేల్చిచెప్పారు. ‘గాజాలోని పౌరుల్ని ఇజ్రాయెల్ చంపింది. దానికి మిత్రదేశాలు అండగా నిలిచాయి. ఘర్షణల్లో అమాయక పౌరులకు హాని కలగకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఏ చట్టాన్నీ పట్టించుకోలేదు. అన్నింటినీ ఉల్లంఘించింది. గాజా యుద్ధంలో ఇప్పటివరకు 45,500మంది చనిపోయారు’ అని పేర్కొన్నారు.